Home » Bhatti Vikramarka Mallu
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
దేశంలోని పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే బీజేపీ కొందరు పెద్దల కోసమే పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు.
ప్రజా భవన్లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..
ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే.. బహుళ జాతి కంపెనీల కోసమే బీజేపీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పోరాడుతుంటే..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు(farmers) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.