Praja Bhavan: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు.. ఇంతకీ ఏం జరిగింది..?
ABN , Publish Date - May 28 , 2024 | 03:37 PM
ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.
ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు
పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఆగంతకుడి ఫోన్
రంగంలోకి దిగిన పోలీసులు
ప్రజా భవన్‌లో విస్తృత తనిఖీలు
డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు
నివాసం లోపల, పరిసర ప్రాంతాలు, వాహనాలను తనిఖీ చేసిన ఐఎస్‌డబ్ల్యూ, సిఎస్ డబ్ల్యూ పోలీసులు
రెండు గంటలపాటు తనిఖీలు
ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కుటుంబం ఉంటున్న ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని అజ్ఞాత వ్యక్తి ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ చేరుకొని అణువణువు తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజా భవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్‌రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, డిప్యూటీ సీఎం చాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. ప్రజా భవన్‌లో రెండు గంటలకు పైగా చేపట్టిన తనిఖీలు ముగిశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి సీతక్క నివాసంలో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అది ఫేక్ కాల్ అని పోలీసులు భావిస్తున్నారు.
వాహనాల తనిఖీ
భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్‌లో గల అమ్మవారి ఆలయంలో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రజాభవన్‌లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా కనిపెట్టే పనిలో ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా..? ఉద్దేశపూర్వకంగా ఫోన్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజాభవన్‌లో బాంబ్ ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
పేరు మార్పు
సీఎం క్యాంపు కార్యాలయాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా భవన్‌గా మార్చారు. క్యాంపు కార్యాలయం రూపు రేఖలు పూర్తిగా మార్చేశారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దానిని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చారు. ప్రజా భవన్‌లో ఉండేందుకు రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి భట్టి విక్రమార్క దంపతులు ప్రజా భవన్‌లో ఉంటున్నారు.
Read Latest Telangana News and National News