Home » Bihar
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
బిహార్లో రోజుల వ్యవధిలో వంతెనలు వరుసగా.. పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్లోని వంతెనల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ వంతెనల కూలిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
బీహార్లోని నవాడా జిల్లా రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అదెలాగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్లో వంతెనలు కూలిపోయే పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా..
బిహార్లోని వైశాలీ జిల్లాలో కుర్రకారు.. బైక్పై రాజమౌళి సినిమాలో ఈగలాగా దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గేమ్స్ ఆఫ్ ఢిల్లీ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
బిహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. బుధవారం ఉదయం వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో బిహార్లో గత పక్షం రోజుల్లో ఏడు వంతెనలు కూలినట్లయింది.
బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి తన తలపాగాను ఎట్టకేలకు తొలగించారు. 2022లో తలపాగా ధరించిన చౌదరి దాదాపు 22 నెలల తర్వాత తన తలపాగాను తొలగిస్తూ.. శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Bihar: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఇక మిగిలింది అధికారికంగా పెళ్లి చేసుకోవడమే. ఆ పెళ్లి తంతు కోసమే అమ్మాయి ఆశగా ఎదురు చూస్తోంది. కానీ, అబ్బాయేమో తాత్సారం చేస్తూ వస్తున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. కానీ,
కొందరిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏదైనా తమకు దక్కలేదంటే చాలు ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఆ కోవలో చదువుకున్న వారు, ప్రొఫెషన్స్, వైద్యులు కూడా ఉంటున్నారు. బీహార్లో ఓ వైద్యురాలు ఇలానే చేశారు. పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ నో అనడంతో తన విశ్వరూపాన్ని చూపించారు.
రాష్ట్రీయ లోక్ మోర్చా నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ ను బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే నామినేట్ చేసింది. తనను బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరికి ఉపేంద్ర కుష్వాహ కృతజ్ఞతలు తెలిపారు.