Lovers: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రేయసి.. కారణమిదేనట..!
ABN , Publish Date - Jul 02 , 2024 | 05:14 PM
Bihar: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఇక మిగిలింది అధికారికంగా పెళ్లి చేసుకోవడమే. ఆ పెళ్లి తంతు కోసమే అమ్మాయి ఆశగా ఎదురు చూస్తోంది. కానీ, అబ్బాయేమో తాత్సారం చేస్తూ వస్తున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. కానీ,
Bihar: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఇక మిగిలింది అధికారికంగా పెళ్లి చేసుకోవడమే. ఆ పెళ్లి తంతు కోసమే అమ్మాయి ఆశగా ఎదురు చూస్తోంది. కానీ, అబ్బాయేమో తాత్సారం చేస్తూ వస్తున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. కానీ, తన శారీరక వాంఛను మాత్రం తీర్చుకుంటూనే ఉన్నాడు. కొన్ని నెలలుగా ఇదే వ్యవహారం నడుస్తోంది ఇద్దరి మధ్య. అయితే, ఆ అమ్మాయికి ఎక్కడో తేడా కొట్టింది. డైరెక్ట్‌గా పెళ్లి చేసుకుంటావా? లేదా? అని నిలదీసింది. ఇలా దాచి లాభం లేదనుకున్న ఆ అబ్బాయి తన మనసులోని మాటను బయటపెట్టాడు. పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పేశాడు. అతను అన్న ఆ మాటతో యువతి ఉగ్రరూపం దాల్చింది. అవసరానికి తనను వాడుకున్నాడనే ఆగ్రహంతో.. యువకుడికి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యింది. ఇంకేముంది.. ప్రేమగా దగ్గరికి తీసుకుని చేతికందిన కత్తితో ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది. తనలా మరెవరూ మోసపోవద్దనే తానిలా చేశానని చెబుతోంది. మరి ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం..
బీహార్‌లోని చాప్రా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా డాక్టర్ తన ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ అతని ప్రైవేట్ పార్ట్ కోసేసింది. యువతి చాప్రాలోని మధుర ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వార్డ్ కౌన్సిలర్ వేద్ ప్రకాష్‌తో రెండేళ్ల క్రితం యువతికి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. రెండేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతూ వస్తుండగా.. ఇటీవలి కాలంలో పెళ్లి అంశాన్ని ప్రస్తావించింది యువతి. రేపు, మాపు అంటూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తాజాగా పెళ్లి చేసుకుంటావా? లేదా? అని ప్రశ్నించగా.. చేసుకోనని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ఎలాగైన బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయిన యువతి.. అతన్ని తన ఇంటికి పిలిపించింది. అతనితో రొమాన్స్ చేస్తూనే.. అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. తన వద్ద ఉన్న ఆపరేషన్ కత్తితో ప్రైవేట్ పార్ట్ కోసేసింది. దీంతో అతను పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కన వారు వచ్చారు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. తనలా మరే యువతి మోసపోకూడదనే ఉద్దేశంతోనే అలా అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేశానని యువతి వాంగ్మూలం ఇచ్చింది. యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.