Snake vs Man: వ్యక్తిని కరిచి చనిపోయిన పాము.. అసలు కథ తెలిస్తే షాకే..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:04 PM
బీహార్‌లోని నవాడా జిల్లా రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అదెలాగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాట్నా, జులై 05: బీహార్‌లోని(Bihar) నవాడా జిల్లా(Nawada District) రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. పాము(Snake) కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అదెలాగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!
నవాడాలోని రాజౌలి ప్రాంతంలో దట్టమైన అడవి మార్గంగుండా రైల్వే లైన్ ఉంది. రైల్వే కార్మికుడు సంతోష్ లోహర్(35) ఆ రైల్ ట్రాక్ వెంట పని చేస్తున్నాడు. రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోయాడు. కాసేపటి తరువాత ఓ పాము వచ్చి అతన్ని కాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా, బలమైన నొప్పి రావడంతో వెంటనే లేచాడు లోహర్. చుట్టూ చూసే సరికి పాము కనిపించింది. దీంతో షాక్ అయిన లోహర్.. తొలుత భయపడినా.. ఆ తరువాత తేరుకుని పామును పట్టుకున్నాడు. తనను కరిచిన పాముపై ప్రతీకారంతో దాని నడుముపై రెండుసార్లు కొరికాడు. ఇంతలో సహచరులు సంతోష్ లోహర్‌ను రాజౌలీ సబ్‌డివిజన్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అతన్ని ఆస్పత్రికి చేర్చడంతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. లోహర్ చికిత్సకు బాగా స్పందించాడని.. మరుసటి రోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
Also Read: వామ్మో.. యూట్యూబర్‌కు కూడా ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటారా?
అయితే, లోహర్‌ను కరిచిని పాము మాత్రం చనిపోయింది. ఇదే ఇక్కడ అసలైన ట్విస్ట్. అవును, పాము చనిపోవడం వెనుక ఏళ్లనాటి ఒక కథను చెబుతున్నారు లోహర్, స్థానికులు. జానపథ కథల ప్రకారం.. ఏదైనా పాము కాటువేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు ఆ పామును తిరిగి కొరకాలట. ఇలా చేయడం వల్ల శరీరంలోకి వచ్చిన విషం తిరిగి పాముకే ఎక్కుతుందట. అందుకే లోహర్ పాము తనను కాటు వేయగానే.. ఆ పామును పట్టుకుని రెండుసార్లు కొరికాడు. అలా కొరకడంతో తీవ్రంగా గాయపడిన పాము ప్రాణాలు కోల్పోయింది.
Also Read: ఎండుద్రాక్ష వీళ్ళు అస్సలు తినకూడదు..
మూఢ విశ్వాసాలు.. చికిత్స..
ప్రజల మూఢ విశ్వాసాలు ఎలా ఉన్నా.. సమయానికి లోహర్‌ను ఆస్పత్రికి తరలించడం, అతని ఆత్మస్థైర్యం వల్లే బ్రతికాడని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తులు ముందుగా భయపడకుండా, టెన్షన్‌కు గురవకుండా ఉండాలి. లోహర్ విషయంలో అదే జరిగిందని వైద్యులు చెబుతున్నారు. అతన్ని సకాలంలో ఆస్పత్రికి తీసుకోవడంతో చికిత్స అందించామని.. ఆ చికిత్సకు లోహర్ సరైన రీతిలో స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు చెబుతున్నారు.