Home » BJP
ఎంతో ఉన్నతమైన ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాడుచేయొద్దని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోయంబత్తూరు తూర్పు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్(Coimbatore East MLA Vanathi Srinivasan) ముఖ్యమంత్రి స్టాలిన్కు విఙ్ఞప్తి చేశారు.
గురివింద చందంగా బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందని.. ఆ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.
మహారాష్ట్రలో సీఎం పదవిని ఎవరు తీసుకుంటారనే దానిపై మహాయుతి కూటమిలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ లేదా ఏక్నాథ్ షిండే వీరిలో ముఖ్యమంత్రి పదవికి బీహార్ ఫార్ములాను పునరావృతం చేసే ప్రశ్నే లేదని భారతీయ జనతా పార్టీ చెబుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
అక్టోబర్ 28న 29 మంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను బదిలీ చేయడం ద్వారా కుట్రకు బీజేపీ తెరతీసిందని అతిషి ఆరోపించారు. ఆ తర్వాత స్వల్వ వ్యవధిలోనే ఓటర్ల జాబితా నుంచి ఆప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు.
బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని వైఎస్ షర్మిల తెలిపారు.
‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ఫలితమే నేటి సుప్రీంకోర్టు తీర్పు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీ కాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే..
మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.