Home » Bonalu Festival
సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈనెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
లష్కర్లో బోనాల ఉత్సవాల సందడి మొదలయింది. మహిళలు భారీగా బోనాలు, ఘటాలతో తరలిరావడంతో రెండురోజుల ముందే ఉత్సవం వచ్చినట్టయింది. ఆదివారం జరగనున్న ఉజ్జయిని మహాకాళి బోనాల(Ujjain Mahakali Bonalu) ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు శుక్రవారం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు క్యూ కట్టారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి(Secunderabad Ujjain Mahakali) ఆషాఢ బోనాల జాతరకు పోలీసు శాఖ సర్వసిద్ధం చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధనరష్మీ పెరుమాళ్(DCP Sadhanarashmi Perumal) అన్నారు.
ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) బోనాలకు గ్రేటర్లోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు(Greater RTC ED Venkateshwarlu) తెలిపారు.
రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
ఆర్కేపురం బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) రాద్ధాంతం చేస్తున్నారని జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షేక్ జహంగీర్, లాల్ సతీష్ గౌడ్, ఆదిల్ల జంగయ్యలు అన్నారు,