Share News

Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:17 AM

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద  భక్తుల రద్దీ

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి (Ujjaini Mahankali Temple) భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు (Bonalu) సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఆరు క్యూ లైన్‌లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పోలీసులు, వాలంటీర్లు క్యూ లైన్లలలో భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు.


అమ్మవారి గర్భగుడిలో భక్తుల రద్దీ..

అమ్మవారి గర్భగుడిలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ సిబ్బంది వెంట వెంటనే దర్శనం పూర్తి చేయించి భక్తులను వెలుపలికి పంపుతున్నారు. అమ్మవారి బోనాలు జరుగుతున్న తీరును సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


ట్రాఫిక్ ఆంక్షలు:

ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు నేపథ్యంలో ఆలయ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దీంతో పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంచారు.


దానం నాగేందర్ మాట్లాడుతూ..

ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటున్నామని, బోనాల పండుగను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారాయన. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారాయన.


ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. బోనాల పండుగ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుగానే చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారాయన. ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు కలుగకుండా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అఖిలపక్ష సమావేశం నేడు..

నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

శాంతి అవినీతిపై ఆరా!

ప్రతి రూపాయీ రాబట్టండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 10:19 AM