Home » BRS MLAs List
మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..
పటాన్‌చెరు బీఆర్ఎస్ టికెట్(Patancheru BRS Ticket)పై కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు(BC Bahujan leaders) కోరారు.
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే(BRS sitting MLA)ల్లో పలువురిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా.. అనివార్యంగా మళ్లీ వారికే టికెట్లు కట్టబెట్టారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR). తొలి విడతలోనే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. అందులో సిటింగ్‌లకే పెద్దపీట వేసి అందరినీ ఆశ్చర్చపరిచారు.
నాకు, నా కుమారుడికి టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయ్.. మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బట్టలు ఊడదీస్తా..! ఇవీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) చేసిన సంచలన వ్యాఖ్యలు..
పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్‌లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అసంతృప్తితో ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు..
అవును.. అదిగో ఇదిగో బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.. నేడే విడుదల.. అని ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. మరోవైపు.. సరిగ్గా 12.03 నుంచి 12:50 నిమిషాల మధ్యలో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు (BRS) చెప్పుకున్నప్పటికీ ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
అవును.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పింది అక్షరాల నిజమయ్యింది. సిట్టింగుల్లో 20 నుంచి 25 మందికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హ్యాండివ్వబోతున్నారన్న విషయం గత కొన్నిరోజులుగా అటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో.. ఇటు దమ్మున్న ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే..