Big Breaking : 10 మంది సిట్టింగ్‌లకు షాకిచ్చేసిన కేసీఆర్.. ఆ నియోజకవర్గాలు ఇవే..

ABN , First Publish Date - 2023-08-20T21:01:51+05:30 IST

అవును.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పింది అక్షరాల నిజమయ్యింది. సిట్టింగుల్లో 20 నుంచి 25 మందికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హ్యాండివ్వబోతున్నారన్న విషయం గత కొన్నిరోజులుగా అటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో.. ఇటు దమ్మున్న ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే..

Big Breaking : 10 మంది సిట్టింగ్‌లకు షాకిచ్చేసిన కేసీఆర్.. ఆ నియోజకవర్గాలు ఇవే..

అవును.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పింది అక్షరాల నిజమయ్యింది. సిట్టింగుల్లో 20 నుంచి 25 మందికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హ్యాండివ్వబోతున్నారన్న విషయం గత కొన్నిరోజులుగా అటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో.. ఇటు దమ్మున్న ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. జాబితా రిలీజ్ చేయడానికి ముందు రోజే ఈ కథనాలు నిజం చేసేలా 10 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వట్లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు..ఇప్పుడున్న ఈ పది నియోజకవర్గాల్లో ఎవరికి ఎక్కడ్నుంచి ఇచ్చే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి.కామ్‌ రాసిన గుమ్మడి అనురాధ ఇల్లందు పోటీ చేస్తున్నారని.. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి, ఆత్రం సక్కు బదులు కోవా లక్ష్మికి టికెట్లు ఇవ్వబోతున్నారని ప్రత్యేకంగా రాజకీయ కథనాలు కూడా అక్షరాలా నిజమయ్యాయి.


టిక్కెట్లు కోల్పోయే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే..

01 :- ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి

02 :- ఖానాపూర్ - రేఖానాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్

03 :- బోథ్ - రథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్

04 :- వేముల వాడ - చెన్నమనేని రమేష్ స్థానంలో చెల్మెడ లక్ష్మినర్శింహారావు

05 :- నర్సాపూర్ - మధన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డి

06 :- ఉప్పల్ - బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి

07:- జనగామ - ముత్తిరెడ్డి యాదగిరి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

08 :- స్టేషన్ ఘన్ పూర్ - తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి

09 :- ఇల్లెందు - హరిప్రియ నాయక్ స్థానంలో గుమ్మడి అనురాధ

10 :- వైరా - రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్

కొత్తగా అవకాశం దక్కించుకునే వాళ్లు :-

01 :- హుజూరాబాద్ : పాడి కౌషిక్ రెడ్డి

02 :- ములుగు : బడే నాగజ్యోతి

03 :- భద్రాచలం : తెల్లం వెంకట్రావ్

ఇప్పటి వరకూ 13 మందికి దాదాపు టికెట్లు కన్ఫామ్ కాగా.. సోమవారం నాడు కేసీఆర్ రిలీజ్ చేయబోయే జాబితాలో ఇంకెంత మంది ఊహించని షాక్‌లో తగులుతాయో ఏంటో వేచి చూడాలి మరి. మరోవైపు.. సిట్టింగ్‌లు మాత్రం జాబితా వచ్చే చివరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియవచ్చింది. జాబితా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని ఎమ్మెల్యేల అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దీన్ని సువర్ణావకాశంగా మలుచుకునేందుకు వేయి కళ్లతో వేచి చూస్తున్నాయి.


ఇవి కూడా చదవండి


TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?


BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!


KCR Vs Ponguleti : ప్చ్.. ‘తెల్లం’ షాక్ నుంచి తేరుకోక ముందే పొంగులేటికి మరో ఝలక్.. బీఆర్ఎస్‌లోకి మరో ముఖ్యనేత..!?



Updated Date - 2023-08-20T23:16:34+05:30 IST