Home » BRS MLAs List
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..?..
అవును.. బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు అదిగో.. ఇదిగో అని చెప్పి ప్రతిసారీ వాయిదా వేస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్ర్యత్యర్థులకు ఊహించని రీతిలో ముందు ఉండాలని.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్లానట...
రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార బీఆర్‌ఎస్(BRS) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నవారితోపాటు ప్రజల్లో పట్టు సాధించని వారిని పక్కనపెట్టాలని, సమర్థులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.
రాబోయే ఎన్నిక(upcoming election)ల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్(BRS) అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా పలు పార్టీల్లో ఉన్న నేతలను బీఆర్ఎస్‌లో చేరేలా పావులు కదుపుతోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపికచేసే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ నెలలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తుందని టాక్ నడిచింది కానీ.. ఆగస్టులో సగం నెల పూర్తయ్యినప్పటికీ ఇంతవరకూ చలీ చప్పుడు లేదు..
అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులన్నీ పనిచేయడమే తెలిసిన బీఆర్‌ఎస్(BRS)లో ఈసారి కొత్త ట్రెండ్ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి.. అసమ్మతిని దాటి మరింత తీవ్రరూపం దాల్చింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది..
అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మళ్లీ మొత్తం మార్చేశారు..! రెండు నెలలుగా ఇదిగో.. అదిగో అంటూ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాపై (BRS Mla candidates) ఊరిస్తూనే వస్తున్నారు.! మొదట జూన్‌లో అని.. ఆ తర్వాత జూలై-10, 12 తారీఖుల్లో అని.. ఆ తర్వాత ఆగస్టు 12 లేదా 13 తారీఖు జాబితా ప్రకటన ఉంటుందనే పుకార్లు షికార్లు చేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఇవాళ జాబితా బయటికి రావాల్సి ఉంది. సీన్ కట్ చేస్తే..
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.
తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మధ్య విభేదాలు. ఈసారి టికెట్ దక్కకపోతే కాంగ్రె్‌సలో చేరే యోచనలో ఉన్న మహేందర్‌రెడ్డి. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పట్ల సీనియర్ నేతలు చందర్‌రావు, కె.శశిధర్ రెడ్డి తదితరుల అసంతృప్తి. స్టేషన్ ఘన్‌పూర్‌లో