BRS First List : ఆ ఒక్కరికి తప్ప.. కాంగ్రెస్‌ నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలందరికీ నో టికెట్..!?

ABN , First Publish Date - 2023-08-20T22:35:07+05:30 IST

2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..?..

BRS First List : ఆ ఒక్కరికి తప్ప.. కాంగ్రెస్‌ నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలందరికీ నో టికెట్..!?

2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరా..? ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప మిగిలిన ఏ ఒక్కరికీ కారులో చోటు లేదా..? ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు ఇవ్వనని తేల్చి చెప్పేసిన కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చేశారా..? ఈ ఎమ్మెల్యేల స్థానాల్లో కొన్నింటిలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిన వారు..? మరికొన్ని కొత్త ముఖాలను బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నారా..? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? ఎవరా కొత్త ముఖాలు అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


Congress.jpg

కాంగ్రెస్‌ తరఫున గెలిచి కారెక్కిందెవరు..?

01 :- ఆసిఫాబాద్ : ఆత్రం సక్కు

02 :- ఎల్లారెడ్డి : జాజాల సురేందర్

03 :- ఎల్బీ నగర్ : సుధీర్​రెడ్డి

04 :- మహేశ్వరం : సబితా ఇంద్రారెడ్డి

05:- తాండూరు : పైలెట్​రోహిత్​రెడ్డి

06 :- నకిరేకల్ : చిరుమర్తి లింగయ్య

07:- భూపాలపల్లి : గండ్ర వెంకటరమణారెడ్డి

08:- పినపాక : రేగా కాంతారావు

09:- ఇల్లెందు : హరిప్రియా నాయక్

10:- కొత్తగూడెం : వనమా వెంకటేశ్వర్​రావు

11:- పాలేరు : కందాల ఉపేందర్​రెడ్డి

12:- కొల్లాపూర్ : హర్షవర్ధన్​రెడ్డి.. వీరంతా కాంగ్రెస్ తరఫున గెలిచి గులాబీ కండువా కప్పుకున్నారు.

KCR-Sabha.jpg

టిక్కెట్లు కోల్పోయే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే..!

01 :- ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి

02 :- ఖానాపూర్ - రేఖానాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్

03 :- బోథ్ - రథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్

04 :- వేముల వాడ - చెన్నమనేని రమేష్ స్థానంలో చెల్మెడ లక్ష్మినర్శింహారావు

05 :- నర్సాపూర్ - మధన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డి

06 :- ఉప్పల్ - బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి

07:- జనగామ - ముత్తిరెడ్డి యాదగిరి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

08 :- స్టేషన్ ఘన్ పూర్ - తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి

09 :- ఇల్లెందు - హరిప్రియ నాయక్ స్థానంలో గుమ్మడి అనురాధ

10 :- వైరా - రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్

BRS-Public.jpg

కొత్తగా అవకాశం దక్కించుకునే వాళ్లు :-

01 :- హుజూరాబాద్ : పాడి కౌషిక్ రెడ్డి

02 :- ములుగు : బడే నాగజ్యోతి

03 :- భద్రాచలం : తెల్లం వెంకట్రావ్

Congress-And-BRS.jpg

ఇంతకీ ఎవరా ఒక్కరు..!?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు అక్కడ అంతటి నాయకుడు లేరు. ఎందుకంటే.. మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇక ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి.. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఓకే చెప్పినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పక్కాగా ఆ ఇద్దరికీ హామీ ఇవ్వలేదని తెలిసింది. ఎందుకంటే 2018లో అచ్చొచ్చిన ఫార్ములానే రిపీట్ చేయాలన్నది కేసీఆర్ మనసులో ఉందట. జనాల నాడిపట్టిన కేసీఆర్.. ప్రజా వ్యతిరేకత, వర్గ విబేధాలు, క్యాడర్‌తో ఇబ్బందులు ఇలా అన్నీ బేరీజు చేసుకున్న తర్వాత సర్వే చేయించగా.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం నుంచి టీడీపీ తరఫున గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల విషయంలో ఇంకాస్త టైమ్ పడుతుందట. అందుకే ఖమ్మంలో కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ పెడతారని తెలిసింది. సోమవారం ప్రకటిస్తారన్న జాబితాలో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు ఉంటాయో.. ఆ ప్రకటన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహకందట్లేదు!.

CM-KCR.jpg


ఇవి కూడా చదవండి


Big Breaking : 10 మంది సిట్టింగ్‌లకు షాకిచ్చేసిన కేసీఆర్.. ఆ నియోజకవర్గాలు ఇవే..


TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?


BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!


KCR Vs Ponguleti : ప్చ్.. ‘తెల్లం’ షాక్ నుంచి తేరుకోక ముందే పొంగులేటికి మరో ఝలక్.. బీఆర్ఎస్‌లోకి మరో ముఖ్యనేత..!?


Gannavaram : టీడీపీలోకి యార్లగడ్డ.. ‘దుట్టా’ సంగతేంటి.. వైసీపీలోనే ఉంటారా.. సైకిలెక్కుతారా.. !?


Updated Date - 2023-08-20T23:11:17+05:30 IST