Home » BRS
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పై కాగితాలు విసిరారు. దీనికి ప్రతిగా వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కాగితాలు విసిరారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.