Share News

Minister Seethakka : కేటీఆర్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 20 , 2024 | 02:01 PM

ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.

Minister Seethakka : కేటీఆర్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం తీసుకొని ఈ కార్ రేస్‌కు మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. ఇవాళ(శుక్రవారం) మీడియాతో మంత్రి సీతక్క చిట్‌చాట్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు అని నిలదీశారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను, అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి సీతక్క అన్నారు.


బీఏసీలో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదని అన్నారు. ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు నిజాయితీ లేదని.. అందుకే అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శలు చేశారు.


ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు పోరాటం: జగ్గారెడ్డి

jagga-reddy-media.jpg

అంబేద్కర్‌పై కేంద్ర హోంమత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ(శుక్రవారం) గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... చట్టాలు ,న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని చెప్పారు. బీసీలుగా చెప్పుకొనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారని అన్నారు.


అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరన్న విషయం అమిత్ షా గుర్తించాలని అన్నారు. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరని అన్నారు. బీజేపీ దేవుడిని మొక్కేదే పబ్లిసిటీ కోసమని విమర్శి్ంచారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 02:02 PM