Home » BRS
ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
హైదరాబాద్‌ని సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మధుసూదన చారి ధ్వజమెత్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ తనకున్న శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తెచ్చారని తెలిపారు
రేవంత్ రెడ్డి సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యాడని, ఇక తన వల్ల కాదని దూస గణేష్ అనే నేతన్న తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంతరి కేటీఆర్ అన్నారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ కూతుళ్లకు సమాధానం చెప్పాలన్నారు.
పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు.
ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్ పై కేసు నమోదుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాబోయే సీఎం... అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆటపట్టించారు.
బీఆర్ఎస్ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లచొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే... అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిపోయేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.