BRS:.. మరో నేతన్న బలి: కేటీఆర్
ABN , Publish Date - Dec 20 , 2024 | 10:42 AM
రేవంత్ రెడ్డి సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యాడని, ఇక తన వల్ల కాదని దూస గణేష్ అనే నేతన్న తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంతరి కేటీఆర్ అన్నారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ కూతుళ్లకు సమాధానం చెప్పాలన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామావు (Ex Minister KTR0 కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) చేశారు. సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యాడని, ఇక తన వల్ల కాదని దూస గణేష్ అనే నేతన్న తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని అన్నారు. సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం వలన, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక వెళ్లిపోయాడని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లను మళ్లీ ఉరిసిల్లగా సీఎం రేవంత్ రెడ్డి మారుస్తున్నారని…. ఆ చిన్నారుల ఆర్తనాధాలు వినిపిస్తున్నాయా అని అన్నారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ కూతుళ్లకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం కక్షసాధింపుల్లో క్షణం తీరికలేకుండా ఉందని ఎద్దేవా చేశారు. నేతన్నలైనా, రైతన్నలైనా తమ బిడ్డలను అనాథలుగా వదిలి వెళ్ళాల్సిందేనని .. మరణవాంగ్మూలాలు, అప్పుల చిట్టాలే.. వారి బిడ్డలకు దక్కే ఆస్తులని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ ఏ1
కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, నాటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1),(ఏ) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120 బి ప్రకారం కేసు నమోదు చేశారు. మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి.. ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది..
కాగా, ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉండబోతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలం కిందట రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరిన విషయం తెలిసిందే. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసును ఏసీబీకి పంపాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. సంబంధిత పత్రాలను సీఎస్ శాంతికుమారి ఏసీబీకి పంపించారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి పంపారు. బుధవారం సాయంత్రం ఐదున్నరకు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలించిన తర్వాత ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం నాలుగు గంటలకు కేటీఆర్ తదితరులపై ఏసీబీ సీఐయూ యూనిట్ డీఎస్పీ మజీద్ ఖాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..
సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News