Share News

ED: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:14 PM

ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్‌తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

ED: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ

హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసు (Formula E car race case)లో ఈడీ (ED) కూడా జోక్యం చేసుకోవడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కేటీఆర్ తనను కాపాడాలని ఢిల్లీ పెద్దల శరణు కోరారని ఆరోపించిన కాంగ్రెస్ (Congress) నేతలపై బీజేపీ (BJP) కౌంటర్లు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయానికి వస్తే ఫార్ములా ఈ కారు రేసులో రూ. 55 కోట్లు.. ప్రభుత్వం, సీఎస్ అనుమతి లేకుండా.. ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ, ప్రిన్స్‌పల్ సెక్రటరీ స్థాయి అధికారులతో రూ. 55 కోట్ల బదలాయింపు చేసినట్లు కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఏసీబీ కేసు ఇప్పటికే ఫైల్ అయింది. కొత్తగా అందులో ఈడీ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.


మరోవైపు ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్‌తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు కూడా ఇవ్వాలన్నారు.


కేటీఆర్ ఏ1

కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, నాటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ3గా పేర్కొంది. కేటీఆర్‌ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(1),(ఏ) రెడ్‌ విత్‌ 13(2) సెక్షన్‌ 409, 120 బి ప్రకారం కేసు నమోదు చేశారు. మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి.. ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉండబోతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలం కిందట రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మను కోరిన విషయం తెలిసిందే. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసును ఏసీబీకి పంపాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. సంబంధిత పత్రాలను సీఎస్‌ శాంతికుమారి ఏసీబీకి పంపించారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌ ఏసీబీకి పంపారు. బుధవారం సాయంత్రం ఐదున్నరకు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలించిన తర్వాత ఏసీబీ డీజీ విజయ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు గురువారం నాలుగు గంటలకు కేటీఆర్‌ తదితరులపై ఏసీబీ సీఐయూ యూనిట్‌ డీఎస్పీ మజీద్‌ ఖాన్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: నారా భువనేశ్వరి

మరో నేతన్న బలి: కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..

కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 20 , 2024 | 01:56 PM