Home » BRS
అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.
ఫార్మా విలేజ్ కోసం సేకరించతలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన లగచర్ల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసి జైలుకు పంపించిందని, వారిని బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ బడంగ్పేట్ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి(Ramidi Ram Reddy) డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పుష్ప 2 సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే.. పుష్ప 3 లెవల్లో మైలేజ్ వస్తుందనుకొంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసిందని, ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను ఆరున్నర ఏళ్ళు అయినా పూర్తి చేయలేదని ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. నిన్న (మంగళవారం) నల్ల చొక్కలు వేసుకుని వచ్చిన నేతలు.. ఈరోజు ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి రానున్నారు. రోజుకో గెటప్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తున్నారు.
భవిష్యత్తులో లగచర్ల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పతనం మెదలైనట్లే అని జోస్యం చెప్పారు కేటీఆర్. రైతు రుణమాఫీ నుంచి మొదలుకుని అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని కేటీఆర్ ఆగ్రహించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు మూడో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు.