Share News

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

ABN , Publish Date - Dec 17 , 2024 | 08:51 PM

భవిష్యత్తులో లగచర్ల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పతనం మెదలైనట్లే అని జోస్యం చెప్పారు కేటీఆర్. రైతు రుణమాఫీ నుంచి మొదలుకుని అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని కేటీఆర్ ఆగ్రహించారు.

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..
BRS Working President KTR

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ప్రకటించారు. రాష్ట్రంలో ఎవరిని అరెస్టు చేయాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు క్యాబినెట్ మీటింగ్‌ (Cabinet Meeting)లో చర్చిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో కొడంగల్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

Hyderabad: ఆ ఘటనపై శాసన మండలిలో మాట్లాడతా: తీన్మార్ మల్లన్న..


భవిష్యత్తులో లగచర్ల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పతనం మెదలైనట్లే అని జోస్యం చెప్పారు కేటీఆర్. రైతు రుణమాఫీ నుంచి మొదలుకుని అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని కేటీఆర్ ఆగ్రహించారు. తెలంగాణలో 30 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని మాజీ మంత్రి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటున్న రేవంత్ రెడ్డి స్థాయికి తామే చాలంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Allu Arjun Case: సంధ్య థియేటర్‌ ఇక గతమేనా..


సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల భూములు గుంజుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి కుటుంబం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కనీసం వార్డు మెంబర్, జడ్పీటీసీ కూడా కాదని, కానీ పోలీసుల అండతో అరాచకం చేస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొడంగల్‌లో సేకరిస్తున్న భూములు రేవంత్ రెడ్డి తన అల్లుడు, అదానీ కోసమే తీసుకుంటున్నారని ఆరోపించారు. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని, అసెంబ్లీ నడిచినన్ని రోజులూ లేవనెత్తుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hyderabad: సినీ నటిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..

Updated Date - Dec 17 , 2024 | 10:01 PM