Home » Buddha Venkanna
వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.
టీడీఆర్ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
విజయవాడ: టీడీఆర్ బాండ్ల కంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు.
తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీచేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది.
నేడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. గతంలో చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
రుషికొండపై మాజీ మంత్రి రోజా ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండ విషయమై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించారు. రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలతో పాటు నాడు చెప్పిన త్రి మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని వెల్లడించారు. ఓటమి కారణంగా రోజాకు మతి చెడిందని ఎద్దేవా చేశారు.
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.