TDP: విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే, భయపడతారా..: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Dec 08 , 2024 | 12:25 PM
వైఎస్పార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం (TDP) సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) ఆదివారం పోలీసు కమీషనర్ (Police Commissioner)ను కలిసి వైఎస్సార్‌సీపీ ఎంపీ (YSRCP MP) విజయసాయిరెడ్డి (ijayasai Reddy)పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు. చంద్రబాబు బతికి ఉంటే.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే.. ఆయనను జైల్లో వేస్తాం అంటావా.. అంటే బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే.. భయపడిపోతారని అనుకుంటున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా.. ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరని.. కేవీ రావు దగ్గర ఎలా తీసుకున్నారో చెప్పగలరా.. అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వైఎస్సార్‌సీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని.. ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కులాన్ని అంటగడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తప్పు చేయలేదని, బలవంతంగా లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేస్తారా.. అంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు.
చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడతారా.. ప్రజలు చెప్పులతో కొడతారని బుద్దా వెంకన్న అన్నారు. గతంలో కూడా ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారని, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అతని ఉన్మాదానికి పరాకాష్ట అని..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే... లోపలేస్తాం అని అంటే.. చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. నీలాంటోడిని ఏమాత్రం ఉపేక్షించకూడదు.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని.. పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని.. చట్టపరంగా సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని కోరామన్నారు.
పరువు నష్టం దావా వేయడానికి.. అసలు విజయసాయిరెడ్డికి పరువు ఉందా.. విజయసాకి దమ్ముంటే.. తనపై పరువు నష్టం దావా వేయాలని.. చూసుకుందాం అంటూ బుద్దా వెంకన్న సవాల్ చేశారు. కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని, జగన్, వైఎస్సార్‌సీపీ నాయకులపై బాధితులే ముందుక వచ్చి కేసులు పెడుతున్నారన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే సహించలేక.. నోరు పారేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో విశాఖలో మీడియా ప్రతినిధులను బూతులు తిట్టిన విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడుతున్నారని, ఏపీకి వస్తే మీడియా వాళ్లే కొడతారని విజయసాయిరెడ్డికి భయం.. అందుకు రావడంలేదన్నారు.
చంద్రబాబుపై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తాను న్యాయస్థానానికి వెళ్లి అయినా పోరాటం చేస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. కుల ముద్ర వేయడం ఏమిటి.. జైలుకు పంపడం ఏమిటి.. చంపుతామని బెదిరించడం ఏమిటి.. ఇక నుంచి విజయసాయిరెడ్డి ఏది వాగినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసు కమిషనర్ కూడా తన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారన్నారు. న్యాయనిపుణలను సంప్రదించి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. పోలీసులు చర్యలు తీసుకోక పోతే.. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న మరోసారి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News