Home » Budget 2024
Budget 2024: కర్ణాటక ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. అయితే, ఆమె ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్‌లూ విశేషమే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి.. ప్రత్యేక చీరలో కనిపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు..
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.
బడ్జెట్ 2024(budget 2024) నేపథ్యంలో మధ్యతరగతి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అంది ఏంటంటే బంగారం(gold), వెండి(siver), ప్లాటినం, మొబైల్స్(mobile phones), సహా పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీని మోదీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు క్రమంగా తగ్గనున్నాయి.
Andhrapradesh: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్‌లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పారని.. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని..
Telangana: కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ బడ్జెట్‌లాగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదు, అసూయ లేదు’’ అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందని గుర్తుచేశారు. బీజేపీకి గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్నారు.
Andhrapradesh: ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు.
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.