Share News

CM Revanth: కేంద్ర బడ్జెట్‌‌లో తెలంగాణపై వివక్ష.. రేవంత్ రెండు కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:15 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

CM Revanth: కేంద్ర బడ్జెట్‌‌లో తెలంగాణపై వివక్ష.. రేవంత్ రెండు కీలక నిర్ణయాలు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024లో (Budget-2024) తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్ర హక్కులను కాపాడేలా బుధవారం నాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ ‘కుర్చీ బచావో బడ్జెట్‌’ లాగా ఉందని విమర్శలు గుప్పించారు. ఇంత కక్షపూరిత బడ్జెట్ గతంలో తాను ఎప్పుడూ లేదన్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికల ముందే చెప్పిన విషయాన్ని మరోసారి రేవంత్ గుర్తు చేశారు.


మా ప్లాన్ మాకుంది..!

ఇది నాయుడు, నితీష్ డిపెండెంట్ అలయన్స్. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల కక్షపై అసెంబ్లీలో చర్చకు తీర్మానం చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించాం.కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీల ఎంపీలు పార్లమెంట్లో నిరసన చేయాలి. కేంద్ర బడ్జెట్ కక్షపై పార్లమెంట్, అసెంబ్లీలో కార్యాచరణ ఉంటుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి బానిసలాగా కాకుండా, తెలంగాణ పౌరునిగా ఆలోచించాలి. పునర్విజన చట్టంలో తెలంగాణకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలి. కేంద్రం నిధులు ఇవ్వకున్నా మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. మోదీ పెద్దన్న లాగా కనిపించడం లేదుఅని రేవంత్ విమర్శించారు.


కేసీఆర్‌పై ఇలా..

ఇదే మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్, సౌత్ ఇండియాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ కక్షపై కలిసివచ్చేది ఎవరు..? చీకటి ఒప్పందాలు చేసుకుంది ఎవరు..? అనేది రేపు తేలిపోతుంది. కేసీఆర్ సభకి వస్తే తెలంగాణ ప్రజల కోసం నిలబడుతున్నట్లు లేదంటే కిషన్ రెడ్డితో కలిసి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాలని అనుకున్నాను. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయం మాట్లాడాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలు ఓట్లు వేసే యంత్రాలుగా కనిపిస్తున్నాయి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 23 , 2024 | 06:25 PM