Share News

CM Chandrababu: వెంటీలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చారు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:57 PM

Andhrapradesh: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్‌లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పారని.. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు.

CM Chandrababu: వెంటీలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చారు..
CM Chandrababu Naidu

అమరావతి, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో (Budget 2024) ఏపీకి వరాలు అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrabau Naidu)ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్‌లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పారని.. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు. వెనకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారన్నారు. ఎకనామిక్ గ్రోత్‌కు కూడా ముందుకు వచ్చారని తెలిపారు.

Budget 2024: యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు.. బడ్జెట్‌పై మోదీ



వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌కు ఆక్సిజన్ ఇచ్చారని అన్నారు. ఆక్సిజన్ మాత్రమే ఇచ్చారని... ఇది ఆరంభం మాత్రమే అని సీఎం వెల్లడించారు. ఇందుకు అందరం కష్టపడాలని చెప్పారు. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. ఏపీకి ఉన్న వనరులు, సూపర్ సిక్స్ అమలుకు కూడా నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు 100 వరకు ప్రారంభిస్తామన్నారు. లాండ్ టైటలింగ్ యాక్ట్‌ను దుర్మార్గంగా ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఏమి జరుగుతుంది అనేది ఈ చట్టం ద్వారా తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Union Budget 2024: యువత, రైతులకు ప్రాధాన్యత.. బంగారు ప్రియులకు గుడ్‌న్యూస్.. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..


ధన్యవాదాలు....

మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం అందించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.... ‘‘మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌లో రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, గౌరవనీయులు కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు. కేంద్రం అందించిన ఈ తొడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దొహదం చేస్తుంది. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్‌ సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?

Sujanachowdary: ఏపీ చరిత్రలో చాలా శుభదినం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 04:08 PM