KTR: తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఇచ్చింది గుండు సున్నా..
ABN , Publish Date - Jul 23 , 2024 | 02:11 PM
Telangana: కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ బడ్జెట్‌లాగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదు, అసూయ లేదు’’ అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందని గుర్తుచేశారు. బీజేపీకి గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్నారు.
హైదరాబాద్, జూలై 23: కేంద్ర బడ్జెట్ (Budget 2024) ఏపీ, బీహార్ బడ్జెట్‌లాగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదు, అసూయ లేదు’’ అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందని గుర్తుచేశారు. బీజేపీకి గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు సాధించింది ఏమీ లేదని విమర్శించారు.
Budget 2024: వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఉలుకు పలుకు లేదన్నారు. పారిశ్రామిక కారిడార్ స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి చాలా మంది మంత్రులను కలిసినా తెలంగాణకు మిగిలింది శూన్యమే అని అన్నారు. తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఇచ్చింది గుండు సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 16 స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్, ఎనిమిది బీజేపీ గెలిచిందన్నారు. ఏపీలో 16 మంది ఎంపీలతో కేంద్రాన్ని శాసిస్తున్నారని తెలిపారు. ఎప్పటికైనా తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా నోరు మెదపలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి
TS News: సనత్‌నగర్‌లో ముగ్గురి మృతి కేసులో మిస్టరీ ఇదే!
Read Latest Telangana News And Telugu News