Home » Bus Facility
గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజూమున డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు- పాలట్యాంకర్ ఢీకొన్నాయి.
బంగారాన్ని ముక్కలుగా చేసి, ప్రత్యేక సంచుల్లో దాచి బస్సులో రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..
ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్‌లెస్) ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది.
మాదాపూర్, హైటెక్ సిటీ(Madapur, hi-tech city)లో పనిచేస్తున్న ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం 127కె కోఠి-కొండాపూర్ రూట్లో కొత్తగా ఎలక్ర్టిక్ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను(Electric AC Metro Luxury Buses) సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది.
ప్రమాదాల నివారణ కు....ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటు బస్సు డ్రైవర్లు...ఇటు ప్రయాణికులు సైతం పెడ చెవిన పెడుతున్నారు. నడి రోడ్డుపై బస్సు ఆపడం...నడి రోడ్డులో నిలబడిన బస్సును ఎక్కడం ప్రమాదమని తెలిసినా వారు అదే పనిచేస్తూ ప్రమాదాలను కొని తె చ్చుకుంటున్నారు. మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో బస్టాండ్ లేదు.
మన్సూరాబాద్‌లోని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ బస్సును పునఃప్రారంభించడం హర్షణీయమని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్(Mansurabad) డివిజన్లోని ప్రెస్ కాలనీ, సౌంత్ ఎండ్ పార్క్, సెవెన్ హిల్స్‌కాలనీ, డిపినగర్, చండీశ్వర్‌కాలనీలకు గతంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగాయి.
బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్నెస్ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి.