Home » Bus Yatra
ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్‌కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్‌రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.
అమరావతి: సీఎం జగన్‌కు తగిలిన రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ, వివేక హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టి...
అమరావతి: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ, సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్డు షో సందర్బంగా పలు మార్లు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి.
అమరావతి: రాళ్ల దాడిలో స్వల్పంగా గాయపడిన సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం సిద్ధం బస్ యాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.
గుంటూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది.
ప్రకాశం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కనిగిరి, మర్కాపురం నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సుయాత్ర సాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి ప్రధాన రహదారిలో భారీ వృక్షాలను నరికించారు.
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.
కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.