Home » Businesss
శ్రావణ మాసం శుభ కార్యాలకు నెలవు. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తారు. అలాగే ఎక్కడ శుభకార్యం జరిగినా.. గుళ్లు గోపురాలకు వెళ్లినా.. ఒంటి నిండా బంగారు నగలు ధరించి వెళ్లతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళలు.. మహారాణులు లాగా దర్శనమిస్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి.
శ్రావణ మాసం వచ్చేస్తోంది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కళకళ లాడతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది.
రిటైల్ ఫార్మసీ చెయిన్ మెడ్‌ప్లస్.. ఔషధాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. ఈ లేబొరేటరీలో ఔషధాలకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను నిశితంగా పరీక్షించనున్నట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ జీ. మధుకర్ రెడ్డి తెలిపారు.
కెనరా బ్యాంక్‌లో అధికారిక భాష హిందీతో పాటు కన్నడ భాషకు ప్రాధాన్యత ఇచ్చామని బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అధికారిక భాష అమలు కమిటీ (బ్యాంకులు, బీమా సంస్థలు), బెంగళూరు ....
పెట్టుబడిదారులు(investors) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ Ola Electric IPO ఈరోజు(ఆగస్టు 2న) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడింది. అయితే ఈ స్టాక్ విషయంలో మదుపర్లు ఎలా స్పందించారు. ఇప్పటివరకు ఎన్ని రెట్లు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
5 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. అదే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato). ఈ సంస్థ తాజాగా మొదటి త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం.
బ్యాంకులకు ప్రతి నెల సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండో శనివారం కాకుండా పండగల నేపథ్యంలో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల విడుదల చేస్తోంది. ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా జాబితా రిలీజ్ చేసింది.
బ్యాడ్ న్యూస్. కమర్షియల్ సిలిండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల సిలిండర్‌పై రూ.8.50 వరకు పెంచుతున్నామని ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. సబ్సిడీ సిలిండర్ ధరలో యథాతథంగా ఉంటాయని వెల్లడించాయి.
బంగారం ధరలు కాస్త పెరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఆ క్రమంలో గురువారం నుంచే ధరల పెరుగుదల ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.