Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ డే1 ఎలా ఉంది.. ఎంత మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు ?
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:13 PM
పెట్టుబడిదారులు(investors) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ Ola Electric IPO ఈరోజు(ఆగస్టు 2న) సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడింది. అయితే ఈ స్టాక్ విషయంలో మదుపర్లు ఎలా స్పందించారు. ఇప్పటివరకు ఎన్ని రెట్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడిదారులు(investors) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ Ola Electric IPO ఈరోజు(ఆగస్టు 2న) సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడింది. అయితే ఈ స్టాక్ విషయంలో మదుపర్లు ఎలా స్పందించారు. ఇప్పటివరకు ఎన్ని రెట్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ బ్యాండ్ ధర రూ.72 నుంచి రూ.76గా నిర్ణయించబడింది. IPO లాట్ పరిమాణం 195 షేర్లు. అంటే ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం 195 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ IPOను పెట్టుబడిదారులు ఆగస్టు 6 వరకు కొనుగోలు చేయవచ్చు.
ఐపీఓలో
సబ్‌స్క్రిప్షన్ కోసం ఆఫర్ చేసిన 46,51,59,451 ఈక్విటీ షేర్లలో ఆగస్టు 2 శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటల నాటికి ఇన్వెస్టర్లు 12,82,68,075 (23 శాతం) ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. అదే సమయంలో నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 0.3 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 0.48 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులు 2.57 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఐపీఓలో వేలం వేసిన అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.7 తగ్గింపు ఇవ్వబడింది. ప్రమోటర్లు, పెట్టుబడిదారుల ద్వారా సుమారు రూ. 5,500 కోట్ల విలువైన 72,36,84,210 ఈక్విటీ షేర్లను విక్రయించడానికి ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. కంపెనీ ఈ IPO కింద రూ. 645.56 కోట్ల విలువైన 84,941,997 షేర్లను విక్రయిస్తోంది.
తీసుకోవాలా వద్దా?
అయితే ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ కోసం అప్లై చేయాలా వద్దా అని పలువురు అడిగిన ప్రశ్నలకు పలువురు నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిలో బ్రోకరేజ్ సంస్థ జియోజిత్, ఎల్‌కెపి సెక్యూరిటీస్, ఆనంద్ రాఠీ రీసెర్చ్ టీమ్‌తో సహా పలు బ్రోకరేజ్ కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్ IPOపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నాయి. లాంగ్ టర్మ్ ఔట్‌లుక్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని జియోజిత్ ఇన్వెస్టర్లకు సూచించింది. లాభదాయకత, వాల్యుయేషన్ ఆందోళనలపై ప్రస్తుత సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక దృక్పథంతో అధిక రిస్క్ ఆకలి ఉన్న పెట్టుబడిదారులకు 'సబ్స్‌క్రయిబ్' రేటింగ్‌ను సిఫార్సు చేస్తున్నామని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
ఏం చెప్పారంటే..
LKP సెక్యూరిటీస్‌లోని విశ్లేషకులు కూడా పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక ఔట్‌లుక్ కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. ఓలా ఏకైక ప్యూర్-ప్లే టూ-వీలర్ EVగా సవాళ్లను ఎదుర్కొంటుందని నమ్ముతున్నామని తెలిపింది. వాల్యుయేషన్ ఆధారంగా దీర్ఘకాలానికి ఓలా ఎలక్ట్రిక్ IPOకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని ఆనంద్ రాఠీ రీసెర్చ్ టీమ్ సలహా ఇచ్చింది. లాగే వాల్యుయేషన్ విషయంలో కంపెనీ ధర చాలా ఎక్కువగా ఉందని నమ్ముతున్నట్లు చెప్పింది.
న్యూట్రల్ రేటింగ్
స్వస్తిక్ ఇన్వెస్ట్‌మెంట్ దీనికి 'న్యూట్రల్' రేటింగ్ ఇచ్చింది. ఆర్థిక పనితీరు పరంగా ఈ కంపెనీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో నష్టాలను చవిచూసింది. అయితే ఈ కంపెనీలో స్వల్పకాలంలో రాబడులు రాకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో అధిక EV పోటీ కారణంగా ఈ ఉత్పత్తుల ధరలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అయితే ఈ కంపెనీ అమ్మకాలు ప్రతి సంవత్సరం పెరిగిన క్రమంలో తక్కువ నష్టాల కారణంగా నికర లాభం మెరుగుపడింది. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2017లో స్థాపించబడింది.
ఇవి కూడా చదవండి:
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కొన్ని గంటల్లోనే 4 లక్షల కోట్లు ఖతం..
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News