Home » CBI
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా పేర్కొంటూ కవిత పేరు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కోడికత్తి శ్రీను, బెయిల్‌పై విడుదలైన తర్వాత మొదటిసారిగా విశాఖలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి.. ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదన్నారు.
రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.
అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడ చనిపోయిన సంగతి తెలిసందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డికి(YS Jagan Mohan Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.
కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.
వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.
Andhrapradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.