Home » CBI
ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్టులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధిత ప్రజలకు న్యాయం చేస్తామని సీసీఎస్ డీసీపీ శ్వేత పేర్కొన్నారు.
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
Andhrapradesh: అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్ను రైల్వే అధికారులులంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు రోజులు పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది.
Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్ను వేశారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై సమగ్రమైన సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.