Share News

CBI: ధన్వంతరి ఫౌండేషన్‌ మోసం..

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:15 AM

ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ ట్రస్టులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధిత ప్రజలకు న్యాయం చేస్తామని సీసీఎస్‌ డీసీపీ శ్వేత పేర్కొన్నారు.

CBI: ధన్వంతరి ఫౌండేషన్‌ మోసం..

  • 25 దేశాల్లో బాధితులు!

  • 514 కోట్ల మేర మోసపోయిన 4 వేల మంది

  • సంస్థ ఆస్తుల్ని అటాచ్‌ చేశాం: సీసీఎస్‌ డీసీపీ శ్వేత

హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ ట్రస్టులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధిత ప్రజలకు న్యాయం చేస్తామని సీసీఎస్‌ డీసీపీ శ్వేత పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయంలో సుమారు 200 మంది బాధితులతో డీసీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ (డీఎ్‌ఫఐ) ట్రస్టు డైరెక్టర్‌ కమాలకర్‌ శర్మ, మరి కొంతమంది సభ్యులతో కలిసి బ్రాహ్మణ సంఘం పేరుతో వందలాది మందిని మోసం చేశారు. ట్రస్టులో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. సుమారు రూ.514 కోట్లు దండుకున్నారు.


సుస్రాల నర్సింహమూర్తి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. ధన్వంతరి ఫౌండేషన్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో 25 దేశాలకు చెందిన వారున్నారని డీసీపీ శ్వేత తెలిపారు. దాదాపు 4000 మంది మోసపోయారని, వారికి న్యాయం చేసే దిశగా విచారణ ముమ్మరం చేశామని చెప్పారు. డీఎ్‌ఫఐ పేరుతో ఉన్న ఆస్తుల వివరాలను బాధితులకు ఆమె తెలియజేశారు.


అంబర్‌పేటలో డీఎ్‌ఫఐ ఆస్పత్రి, విశాఖపట్నం (అంకపల్లి), విజయవాడ (గన్నవరం), సిద్దిపేట, మిడ్జిల్‌లో సుమారు 450 ఎకరాల భూమి, 3000 చదరపు గజాల వాణిజ్య సముదాయ స్థలం ఉన్నట్లు గుర్తించామని వివరించారు. త్వరలోనే న్యాయస్థానం అనుమతితో వాటిని వేలం వేసి, వచ్చిన సొమ్మును బాధితులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - Jul 09 , 2024 | 04:15 AM