Delhi Liquor Scam: కవితకు బిగ్ షాక్.. బెయిల్ ఆశలు గల్లంతు
ABN , Publish Date - Jul 01 , 2024 | 05:38 PM
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కవితను ఇప్పటికే ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకొని కవితకు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. ఈ కేసులో ఆమెను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
For Latest News and National News click here