Share News

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి తీవ్ర నిరాశ

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:51 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి తీవ్ర నిరాశ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది. నేటితో కవిత జ్యూడిషల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పరిచారు. కాగా ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు.


కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవి ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించి, కోర్టుకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే కవిత మరోసారి అరెస్టయినట్టయింది. అటు ఈడీ.. ఇటు సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో కవిత చాలా కాలంగా జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి.


కాగా కవితకు బెయిల్ దక్కకపోవడంపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర నిరాశకు గరవుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో క్రియాశీలక నాయకురాలైన కవిత జైలులో ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక కీలక నేతల జంపింగ్‌లతో బీఆర్ఎస్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం

బోనాల సందడి షురూ.. తొలి బోనం ఎప్పుడంటే?

For more Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 04:53 PM