Share News

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:25 PM

Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు.

YS Jagan Case: పూర్తి నివేదిక ఇవ్వండి.. జగన్ కేసులపై సీబీఐకి హైకోర్టు ఆదేశం
Telangana High Court Key orders on Jagan cases

హైదరాబాద్/ అమరావతి, జూలై 3: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP Former CM YS Jaganmohan Reddy) కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి (CBI) కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


కాగా సీబీఐ కోర్టులో (CBI Court) ఉన్న జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.


ఇవి కూడా చదవండి...

Congress: రాజ్యసభ నుంచి వాకౌట్‌పై ఖర్గే స్పష్టత..

TS News: కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు

Read Latest AP News AND Telugu News

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 03:39 PM