Share News

MLA Shankar: పార్టీ ఫిరాయింపుపై రాహుల్ గాంధీనే చెప్పారు కదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:12 PM

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)పై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ఖండించారు.

MLA Shankar: పార్టీ ఫిరాయింపుపై రాహుల్ గాంధీనే చెప్పారు కదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
MLA Payal Shankar

ఆదిలాబాద్: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)పై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ఖండించారు. "పది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది. ఆ విషయం కిషన్ రెడ్డికి కనిపించలేదా?, ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారు. మరి నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకొని బీజేపీ మంత్రివర్గంలో చోటు కల్పించారు కదా" అంటూ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు.


ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.." చామల కిరణ్ కుమార్ అనుకోకుండా ఎంపీ అయిన వ్యక్తి. కేసీఆర్, కేటీఆర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా కూడా బీజేపీకి అభ్యంతరం లేదు. గతంలో ఈటల, రాజగోపాల్ రెడ్డిలతో రాజీనామాలు చేయించి మాత్రమే పార్టీలోకి తీసుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఒక్కలా ఇప్పుడు మరోలా వ్యవహరిస్తోంది. పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఇప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా చేర్చుకుంటున్నారో సమాధానం చెప్పాలి.


ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయనివారు కూడా ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులకు మద్దతు ఇచ్చారు కదా.. అప్పుడు మీరు పరీక్షలు రాశారా?. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తే తప్పేంటి. వారి సమస్యలు ఏంటో వారితోనే మాట్లాడి పరిష్కరించాలి. కేసీఆర్ మాదిరి అహంకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తే మాజీ ముఖ్యమంత్రికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుంది" అని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:

Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..

Updated Date - Jul 14 , 2024 | 04:16 PM