Home » Chandrababu arrest
ములాఖత్‌ల సంఖ్యను కుదించడంపై చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు జైలులో 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.
రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఈరోజు(బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్, నాయకుల గృహనిర్బంధంతో పాటు చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్రకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నివేదిక ఇంతవరకూ ఆయన కుటుంబ సభ్యులకు అందలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక మద్దతుతెలుపుతూ నిరసనకు దిగుతున్నారు. హైదరాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తదుపరి విచారణను వచ్చే మంగళవారం(అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు వేర్వేరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి నేడు (శుక్రవారం) కీలక వాదనలు జరిగాయి. అంగళ్లు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలివ్వగా.. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌పైవిచారణ వాయిదాపడింది. వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది.