Supreme Court : చంద్రబాబు అక్రమ కేసులో 17A పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-13T17:07:07+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది.
ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(TDP chief Chandrababu Naidu) క్వాష్ పిటీషన్(Quash petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు విచారణ చేపట్టింది. ఈ విచారణ అనంతరం సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబుకి 17A వర్తిస్తే..ఫైబర్‌నెట్ కేసులో కూడా వర్తిస్తుందని తెలిపింది. స్కిల్ కేసు పూర్తి అయిన తర్వాత.. ఫైబర్‌నెట్‌పై నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. మంగళవారం స్కిల్, ఫైబర్ కేసులపై సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. ఫైబర్‌నెట్ కేసులో ధర్మాసనం ఎక్కడ ఆదేశాలు ఇస్తుందేమోనన్న.. ఆందోళనతో బుధవారం వరకు చంద్రబాబును.. అరెస్ట్ చేయబోమని ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాది ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) అండర్‌టేకింగ్ ఇచ్చారు.