Home » Chandrababu arrest
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్‌ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు.
ఫైబర్ నెట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ సందర్బంగా ఫైబర్ నెట్ కేసునూ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ సతీమణి బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అప్పట్లో ఎన్టీఆర్‌పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్లపై రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. గత వారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్‌పై కోర్టు విచారణ నిర్వహించింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ వేశారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీపై సోమవారం వాదనలు ముగిశాయి. సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే రెండున్నర గంటలకుపైగా వాదనలు వినిపించారు. అయితే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) కూడా విచారణ కొనసాగనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) సోమవారం బెయిల్ (Bail) వస్తుందా?.. రాదా అనే ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూాడా తోసిపుచ్చింది. కాగా ఈ రోజు ఉదయం ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.