Home » Chandrababu
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్ను తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. కీలక శాఖలను ఎవరికి ఇస్తారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.
AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారు.
పోలీసుల అష్ట దిగబంధనంలో బెజవాడ నగరం ఉంది. ప్రమాణ స్వీకారం పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాస్లు ఉన్న వారిని సైతం కనకదుర్గమ్మ వారధి వద్దనే పోలీసులు ఆపేస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలు అనుమతించడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఏపీలో ‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.