Home » Chennai Super Kings
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌కు అభిమానుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికెళ్లినా చెన్నై జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. దేశంలోని ఏ వేదికపై చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అభిమానులు భారీగా తరలివస్తుంటారు.
ఈరోజు ఐపీఎల్ 2024(ipl 2024)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం(Visakhapatnam) మైదానంలో 13వ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే(CSK) జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉంది.
ఇప్పుడు ఐపీఎల్ ట్రెండ్ నడుస్తుండటంతో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకే తాము టికెట్లు అమ్ముతామంటూ క్యూఆర్ కోడ్ పంపించి, ప్రజల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024లో( IPL 2024) నేడు సూపర్ ఫైట్ జరగనుంది. గతేడాది ఫైనలిస్ట్‌లు గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Gujarat Titans) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఐపీఎల్ 2024 రెండో విడత కూడా మన దేశంలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించనున్నారని, అందుకోసం యూఏఈని పరిశీలిస్తున్నారని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.
MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని..
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) నుంచి తప్పుకున్న ధోనీ.. తాజాగా ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.