MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారా?
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:25 PM
MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని..
MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తరువాత ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. అయితే, గతేడాది మోకాలికి దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. లాస్ట్ సీజన్‌లోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, ధోనీ ఈ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. క్రికెట్ నుంచి తప్పుకునే ఉద్దేశ్యంతోనే.. ధోనీ తన కెప్టెన్సీని ముందుగానే వదులుకున్నాడని తెలుస్తోంది. ప్లేయర్‌గా ఈ సీజన్‌లో రాణించి.. గుడ్ ఎండ్ ఇవ్వాలని ధోనీ భావిస్తున్నాడని తెలుస్తోంది.
సీఎస్‌కే టీమ్‌తో ధోనీది విడదీయరాని బంధం..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ధోనీకి విడదీయరాని బంధం ఉంది. సీఎస్‌కే టీమ్‌కు సుధీర్ఘకాలం కెప్టెన్సీ వహిస్తూ.. 5 ట్రోఫీలు అందించాడు. 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ సీజన్‌లో సీఎస్‌కే డీలా పడిపోయింది. ఆ తరువాత మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోనీ.. టీమ్‌కు ట్రోఫీని అందించాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్సీని వదులుకుని క్రికెటర్‌గా రాణించనున్నాడు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
గాయమైన వెనక్కి తగ్గలే..
గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సమయంలో మోకాలికి గాయం అవగా.. ఆ గాయంతోనే ఆడాడు. టీమ్ టైటిల్ గెలుచుకున్న తరువాత.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ధోనీ మొత్తంగా 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 135.92 స్ట్రైక్ రేట్‌తో 5,000 లకు పైగా పరుగులు చేశాడు. గతే ఐపీఎల్ సీజన్‌లో ధోనీ గాయ కారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్‌తో ఎంట్రీ ఇచ్చాడు ధోనీ. ఇసారి ప్రత్యర్థులకు చుక్కలే అంటున్నారు సీఎస్‌కే అభిమానులు.
కెప్టెన్‌గా అధ్భుతమైన రికార్డ్..
ధోనీ మొత్తం 249 మ్యాచ్‌లలో 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016, 2017లో 14 మ్యాచ్‌లకు రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ రెండు సంవత్సరాలలో సీఎస్‌కే ఫ్రాంచైజీపై సస్పెన్షన్ ఉంది. దాంతో ధోనీ రైజింగ్ పూణె సూపర్ జెయింట్ టీమ్‌లో కొనసాగాడు. కెప్టెన్సీ స్టాండింగ్‌లో ధోనీ తరువాత రోహిత్ శర్మ ఉన్నాడు. 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఐపీఎల్‌లో గెలుపు ఓటముల నిష్పత్తిలో ధోనీ టాప్‌లో ఉన్నాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా, స్టీవెన్ స్మిత్ ఉన్నారు.