Share News

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:43 PM

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌కు అభిమానుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికెళ్లినా చెన్నై జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. దేశంలోని ఏ వేదికపై చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అభిమానులు భారీగా తరలివస్తుంటారు.

IPL 2024: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..

ఐపీఎల్‌లో(IPL) అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్‌కు(Chennai Super Kings) అభిమానుల ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికెళ్లినా చెన్నై జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. దేశంలోని ఏ వేదికపై చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అభిమానులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తమ ఆట తీరుతోనూ చెన్నై ఆకట్టుకుంది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో(MS Dhoni) విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఏకంగా 5 సార్లు ట్రోఫీ గెలిచింది. దీంతో సోషల్ మీడియాలోనూ చెన్నైకి భారీగా అభిమానులు ఉన్నారు. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌‌స్టాగ్రామ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ జట్టును అభిమానులు భారీగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 15 మిలియన్లు దాటింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నైసూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ ఇప్పటివరకు 15,348 పోస్టులు చేసింది.


ఆ తర్వాత రెండో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. బెంగళూరుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 13.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆర్సీబీ ఇప్పటివరకు 21,335 పోస్టులు చేసింది. మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ముంబై ఇప్పటివరకు 24,151 పోస్టులు చేసింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది. చాలామంది మంది అభిమానులు ముంబైని ఆన్‌ఫాలో చేశారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 5 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ముంబైకి నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకు ఫాలోవర్ల సంఖ్యలో తేడా ఏకంగా 8 మిలియన్లకు పైగా ఉండడం గమనార్హం. ఇక ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు 3.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. టోర్నీ మొత్తానికి స్టార్ ఆటగాడు దూరం

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!

Updated Date - Mar 31 , 2024 | 04:43 PM