CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇవే!
ABN , Publish Date - Mar 26 , 2024 | 07:13 PM
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
చెన్నై: చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని గిల్ చెప్పాడు. చెన్నై మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. మహేష్ తీక్షణ స్థానంలో పతిరణను తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్‌ల్లో, చెన్నైసూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. చెన్నై గెలిచిన రెండు మ్యాచ్‌లు నాకౌట్ దశలో కావడం గమనార్హం. గతేడాది రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నైసూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్టు ప్లేయర్లు: మతీషా పతిరానా, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్టు ప్లేయర్లు: సాయి సుదర్శన్, శరత్ BR, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సుతార్