Home » Chiranjeevi
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతా మోహన్ ఈ విధంగా స్పందించారు.
అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చిరంజీవి తెలిపారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ని గురువారం రాత్రి ప్రజాభవన్‌లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు.
వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్‌కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో..
మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvwada Ajay Kumar) అన్నారు.
మెగాస్టార్ చిరంజీవినీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే కొడాలి నాని అన్న మాటలు వారి అభిమానులు ఎన్నటి కి మరువరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో ఆ విధంగా తిట్టిస్తున్నాడని విమర్శించారు.
మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల ‘భోళా శంకర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ‘భోళా’తో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు చిరు పారితోషికం వెనక్కి ఇచ్చి ఆదుకొన్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చిరు మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడాయన కోలుకొంటున్నారు. ఆగస్టు 22న పుట్టిన రోజు సందర్భంగా చిరు కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన రావాల్సివుంది. అయితే..