Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి
ABN , Publish Date - Jan 26 , 2024 | 07:43 AM
హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా.. మరొకరు తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది.
132 మందికి..
విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 132 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 132 మందిలో ఐదుగురిని పద్మవిభూషణ్.. 17 మందినిపద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. బిహార్‌కు చెందిన శాంతిదేవి పాసవాన్, శివన్ పాసవాన్ ద్వయానికి కళల విభాగంలో ఒకటి.. కేరళకు చెందిన అశ్వతి తిరునల్ గౌరి, లక్ష్మీ బాయి తంపురట్టి ద్వయానికి సాహిత్యం, విద్య కేటగిరీలో ఒకటి చొప్పున పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. మొత్తమ్మీద ఈ జాబితాలో 30 మంది మహిళలు ఉండగా.. ఎనిమిది మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీవారున్నారు. ఇటీవలే కన్నుమూసిన తమిళ నటుడు.. కెప్టెన్ విజయ్‌కాంత్ సహా తొమ్మిది మందికి మరణానంతర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.