Share News

Chinta Mohan: చిరంజీవి ఓకే అంటే చాలు.. తిరుపతి నుంచి గెలిపించి, సీఎంను చేస్తాం

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:51 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతా మోహన్ ఈ విధంగా స్పందించారు.

 Chinta Mohan: చిరంజీవి ఓకే అంటే చాలు.. తిరుపతి నుంచి గెలిపించి, సీఎంను చేస్తాం

నెల్లూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ (Chinta Mohan) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి (Chiranjeevi) కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతా మోహన్ ఈ విధంగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందని చింతా మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం వచ్చిందని, మంచి నిర్ణయం తీసుకోవాలని చిరంజీవిని ఆయన కోరారు. తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవిని గెలిపిస్తామని తెలిపారు. తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చింతా మోహన్ అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడతానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చింతా మోహన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ చర్యల వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీకి దూరం అయ్యారని వివరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. 130 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 02:03 PM