Home » Chittoor
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.
చిత్తూరులో ఓ ఏనుగు హల్ చల్ చేస్తోంది. ఆదివారం ఉదయాన్నే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి.. వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది.
తిరుపతి: వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన అన్నా రామచంద్రయ్య యాదవ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం కార్యక్రమంతో ఎన్నికల శంఖారావంకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరులో ప్రచార సభలు నిర్వహించనున్నారు.
చిత్తూరు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు మంగళవారం కుప్పం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్ కల్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
Chandrababu Kuppam: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) కుప్పంలో (Kuppam) పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు రంగాల వారిని బాబు కలవబోతున్నారు. ప్రస్తుతం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు చంద్రబాబు...
Andhrapradesh: 2024 ఎన్నికల తరువాత వైసీపీలో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడు అంటూ కామెంట్స్ చేశారు.
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమ, మంగళవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మనవడు, యువనేత లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇవాళ (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 69,072 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.