Share News

Registrations: 55 రిజిస్ర్టేషన్లతో రూ.9.10 లక్షల ఆదాయం

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:48 AM

జిల్లాలోని ఎనిమిది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో 55 రిజిస్ర్టేషన్లు ఆదివారం జరగ్గా ప్రభుత్వ ఖజానాకు రూ.9.10 లక్షలు ఆదాయం వచ్చింది.

Registrations: 55 రిజిస్ర్టేషన్లతో రూ.9.10 లక్షల ఆదాయం
చిత్తూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆదివారం జరుగుతున్న రిజిస్ట్రేషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎనిమిది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో 55 రిజిస్ర్టేషన్లు ఆదివారం జరగ్గా ప్రభుత్వ ఖజానాకు రూ.9.10 లక్షలు ఆదాయం వచ్చింది. పుంగనూరులో 25, పలమనేరులో 9, చిత్తూరు ఆర్‌వోలో 5, కుప్పంలో 5, చిత్తూరు రూరల్‌లో 3, బంగారుపాళ్యంలో 3, కార్వేటినగరంలో 3, నగరిలో 2 రిజిస్ర్టేషన్లు జరిగాయి. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు కూడా పనిచేశాయి. జీఎస్టీ, వ్యాట్‌ బకాయిదారులు తమ బకాయిలను కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించారు. కలెక్టరేట్‌లోని ఖజానా డీడీ కార్యాలయంతో పాటు అన్ని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ శాఖలకు బడ్జెట్‌, నాన్‌ బడ్జెట్‌ పద్దుల కింద గ్రాంట్లు విడుదల చేస్తుండగా వాటిని ఏటీవో, ఎస్‌టీవోలు ప్రాసెసింగ్‌ చేసి సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా బ్యాంకులకు చెల్లింపుల కోసం పంపారు. ప్రభుత్వ లావాదేవీలు కలిగి ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకుల శాఖలు డీసీసీబీ శాఖలు ఆదివారం కూడా పనిచేశాయి. రంజాన్‌ సందర్భంగా సోమవారం సెలవు దినమైనా ఈ కార్యాలయాలు, బ్యాంకుల శాఖలు పనిచేయనున్నాయి.

Updated Date - Mar 31 , 2025 | 12:48 AM