Home » CM Chandrababu Naidu
ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
ఏపీ సీఎం చంద్రబాబు- నటసింహం బాలయ్య అభిమానులు రాత్రి 8.30 ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆహాలో ఆన్స్టాపబుల్ సీజన్-4 షో ప్రారంభం కాబోతుంది. ఎపిసోడ్లో బాలయ్య అడిగే ప్రశ్నలు- చంద్రబాబు చెప్పే సమాధానాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
టీడీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అక్టోబర్ 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇదే అంశంపై శుక్రవారం సమీక్షించారు.
అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, భూసేకరణ, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు.
అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు రాష్ట్రంతోపాటు, రాజధాని అమరావతి బలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పునర్వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
జగన్ షర్మిల ఆస్తి వివాదంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే తమను అందులోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీదట కుదరదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లోశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మూడేళ్లలో రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. తమకు మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు.